AP: ఉత్తరాంధ్రపై సీఎం చంద్రబాబు, ఆయన టీమ్ కన్నుపడిందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. భూములు దోచుకుందామని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు ఇవ్వడం ఎక్కడైనా ఉందా?.. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలవకుండా కేటాయింపులు ఎప్పుడైనా జరిగాయా? అని నిలదీశారు. భూ కేటాయింపులపై న్యాయ పోరాటం చేస్తామని పేర్కొన్నారు.