విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం (AP Govt) గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని స్కూళ్లకు ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 13 నుంచి 25 తారీఖు వరకూ 13 రోజుల పాటు సెలవులు ఇచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ (Department of Education) అధికారులు తాజాగా షెడ్యూల్ విడుదల చేశారు. ఎస్ఏ-1 పరీక్షలను అక్టోబర్ 5 నుంచి 11 వ తారీఖు వరకూ నిర్వహించనున్నారు. పరీక్ష నిర్వహణకు గత సంవత్సరం అనుసరించిన సరి-బేసి విధానాన్ని ప్రభుత్వం ఈ మారు పక్కన పెట్టింది. ఎనిమిదవ తరగతి మినహా మిగతా అన్నీ క్లాసుల పరీక్షలు (Exams) ఉదయం పూట నిర్వహించేందుకు నిర్ణయించింది.
గతంలో 6,8,10 తరగతులకు ఉదయం పూట, ఏడు, తొమ్మిది తరగతుల వారికి మాత్రం మధ్యాహ్నం పూట పరీక్షలు నిర్వహించారు. దీంతో, పరీక్షల నిర్వహణ, సీటింగ్ ఏర్పాట్లు సులువుగా మారాయి. కాగా, ఎస్ఏ-1 పరీక్షల అనంతరం స్కూళ్లకు సెలవులు మొదలవుతాయి. అక్టోబర్ 26 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని సర్కారు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో స్కూళ్లకు సంబంధించిన 2023-24 అకాడమిక్ క్యాలెండర్లో ఈ సెలవుల పూర్తి వివరాలను పాఠశాల విద్యాశాఖ పొందిపరిచారు. క్రిస్మస్ సెలవులను కూడా ఏడు నుంచి అయిదుకు తగ్గించారు. జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. ప్రతి నెల మూడో శనివారం పేరెంట్, టీచర్ మీటింగ్ (Teacher meeting) నిర్వహించాలి. ప్రతి నెల మొదటి వారంలో పాఠశాల విద్యా కమిటీ సమావేశాలు జరగాలి.