Biggboss7: బిగ్ బాస్7 (Biggboss7) తెలుగు 27వ రోజు ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఈ రోజు ప్రసారం అయ్యే ఎపిసోడ్లో టేస్టీ తేజపై నాగార్జున విరుచుకుపడతారు. ఆటలో భాగంగా గౌతమ్‌ను టేస్టీ తేజ (teja) టపా టపా కొడతాడు. దానిపై నాగార్జున సీరియస్ అవుతారు. శివాజీ, సంచాలక్ సందీప్, చివరకు తేజపై ఫైర్ అవుతారు.
గేమ్ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతుంటే సంచాలక్ సందీప్ ఏం చేస్తున్నారని అడిగారు నాగార్జున. సంచాలక్‌గా మరోసారి ఫెయిల్ అయ్యాయని ఫైరయ్యారు. నీవ్వెమైనా గుడ్డొడివా.. కళ్లు కనిపించలేదా అని మండిపడ్డారు. హౌస్‌లో బిగ్ బాస్‌గా వ్యవహరించే శివాజీని కూడా వదల్లేదు. దానికి తాను అరిచానని చెప్పుకొచ్చారు. నువ్వు అరిచింది గౌతమ్ తేజకు వేసినప్పుడు తప్ప.. తేజ గౌతమ్‌కు వేసిన సమయంలో కాదని చెప్పారు. దానికి సంబంధింన వీడియోలను చూపించారు.
కావాలని చేయాలని శివాజీ చెప్పబోగా.. ఏదీ కావాలి, కావాల్లేదో తనకు తెలుసు అని చెప్పారు. ఆ డిసిషన్ తాను తీసుకుంటానని స్పష్టంచేశారు. అంద బైరాగ్ తేజ అంటూ నాగ్ స్టార్ట్ చేశారు. ఏం జరుగుతుందో చూశావుగా అనగా.. చుట్టుపక్కల ఆడపిల్లలు ఆరుస్తున్నారుగా అనగా.. అదీ ఎంకరేజ్ మెంట్ అని సమాధానం ఇచ్చారు. అవునా.. అని వారిని అడగగా.. లేదు సర్. మేం అరిస్తే ఎంకరేజ్ అనుకుంటాడు.. తేజ కొట్టొద్దు, కొట్టొద్దు అన్నామని లేడీస్ చెప్పారు. రియలైజ్ అయ్యేందుకు టైమ్ పట్టిందని తేజ అనగా.. రియలైజ్ అయి ఆపలేదు.. లైన్ నుంచి వచ్చేశాడని ఆపావన్నారు.
పొరపాటు జరిగిందని.. ఏ శిక్ష వేసిన అంగీకరిస్తానని తేజ చెప్పారు. ఏం చేద్దాం శుభ శ్రీ అని నాగార్జున అడగగా.. జైలు అని అంటోంది. జైలు మైనర్ శిక్ష అవుతోందని ప్రియాంక చెబుతోంది. సంచాలక్ సందీప్ ఏం చేద్దాం అని నాగ్ అడగగా.. డైరెక్ట్‌గా ఇంటికి పంపిద్దాం సర్.. అని అంటారు. దీంతో తేజ తల పట్టుకుంటారు. ఆ ప్రోమో ముగిసింది. దీంతో ఈ వారం హౌస్ నుంచి తేజ ఎలిమినేషన్ అవుతాడా అనే సందేహాం కలుగుతుంది.