»7 Notifications Were Released How Many Posts Are There In Total
Job Alert : ఏడు కొత్త నోటిఫికేషన్లు విడుదల చేసిన ఏపీపీఎస్సీ.. ఎన్ని పోస్టులున్నాయంటే ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి APPSC ద్వారా వివిధ ఉద్యోగ ప్రకటనలను విడుదల చేసింది. కాగా, డిసెంబర్ చివరి నెలలో ఏకకాలంలో ఏడు ఉద్యోగ ప్రకటనలు విడుదలయ్యాయి.
Job Alert : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి APPSC ద్వారా వివిధ ఉద్యోగ ప్రకటనలను విడుదల చేసింది. కాగా, డిసెంబర్ చివరి నెలలో ఏకకాలంలో ఏడు ఉద్యోగ ప్రకటనలు విడుదలయ్యాయి. 21,637 ఉద్యోగాలు భర్తీకి గానూ… డిసెంబర్ 31 నాటికి 1,423 పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. మిగిలిన పోస్టులకు కూడా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయాలని APPSC భావిస్తోంది. ఏపీపీఎస్సీ విడుదల చేసిన ఉద్యోగ ప్రకటనల వివరాల్లోకి వెళితే..
* గ్రూప్-1 ద్వారా 81 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. జనవరి 1 నుంచి జనవరి 21 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. మార్చి 17న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు.
* గ్రూప్-2 ద్వారా 897 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రిలిమ్స్ పరీక్ష ఫిబ్రవరి 25న జరుగుతుంది.
* 99 పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్లైన్ దరఖాస్తులు జనవరి 29 నుండి ఫిబ్రవరి 18 వరకు స్వీకరించబడతాయి. పరీక్ష ఏప్రిల్/మేలో జరుగుతుంది.
* 38 డీఈవో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల. జనవరి 1 నుంచి జనవరి 29 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించబడతాయి. ప్రిలిమ్స్ పరీక్ష ఏప్రిల్ 13న జరుగుతుంది.
* 21 ఏఈఈ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తులు జనవరి 30 నుండి ఫిబ్రవరి 19 వరకు స్వీకరించబడతాయి. పరీక్ష ఏప్రిల్/మేలో జరుగుతుంది.
* 47 జూనియర్ లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్లైన్ దరఖాస్తులు జనవరి 31 నుండి ఫిబ్రవరి 20 వరకు స్వీకరించబడతాయి. పరీక్ష ఏప్రిల్/మేలో జరుగుతుంది.
* 240 డిగ్రీ లెక్చరర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్లైన్ దరఖాస్తులు జనవరి 24 నుండి ఫిబ్రవరి 13 వరకు స్వీకరించబడతాయి. పరీక్ష ఏప్రిల్/మేలో జరుగుతుంది.