Group-1: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో మొబైల్ చూస్తూ కాపీ!
ఏపీలో ఈరోజు గ్రూప్-1 పరీక్ష జరుగుతోంది. ఈక్రమంలో ఓ వ్యక్తి కాపీయింగ్‌కు పాల్పడ్డాడు. ఒంగోలు క్విస్ ఇంజినీర్ కళాశాల పరీక్ష కేంద్రంలో ఓ అభ్యర్థి పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్‌తో ప్రవేశించారు.
Group-1: ఏపీలో ఈరోజు గ్రూప్-1 పరీక్ష జరుగుతోంది. అన్ని చోట్ల పరీక్ష ప్రశాంతంగానే ప్రారంభమైంది. అయితే ఒంగోలు క్విస్ ఇంజినీర్ కళాశాల పరీక్ష కేంద్రంలో ఓ అభ్యర్థి పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్‌తో ప్రవేశించారు. మొబైల్ చూస్తూ కాపీ కొడుతూ ఇన్విజిలేటర్‌కు దొరికిపోయాడు. దీంతో ఆ నిందితుడిని కళాశాల సిబ్బంది పోలీసులకు అప్పగించారు. ఆ అభ్యర్థిని పోలీసులు విచారిస్తున్నారు. పరీక్షల పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాకు ఒక ఐఏఎస్ అధికారిని ఇన్చార్జిగా నియమించామని తెలిపారు. పరీక్ష అనంతరం ఆన్సర్ షీట్లు, ఇతర సామగ్రిని కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 301 పరీక్ష కేంద్రాల్లో 1,48,881 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్–2 పరీక్షను ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ క్రమంలో పరీక్ష కేంద్రాల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించామని జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి వెల్లడించారు.