బీమా సొమ్ము ఎగవేత కేసులో జయప్రదకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో జయప్రదకు ఆరు నెలల జైలుశిక్ష విధించిన ఎగ్మోర్ కోర్టు తీర్పును సవాలు చేస్తే జయప్రద ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
Supreme Court dismissed Jayaprada's jail sentence in ESIC case
Jayaprada: సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద(Jayaprada) గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. ఈఎస్ఐసీ డబ్బులను ఇవ్వకుండా మోసం చేసిందని థియేటర్ ఉద్యోగులు ఆమెపై కేసు నమోదు చేశారు. దీంతో జయప్రదకు న్యామస్థానాల్లో చుక్కెదురైంది. తాజాగా ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అక్కడ విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం తనపై కింది స్థాయి కోర్టులు వేసిన శిక్షను కొట్టివేసింది. ఈఎస్ఐసీ కేసులో జయప్రదకు ఎగ్మోర్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఎగ్మోర్ కోర్టు తీర్పను సవాలు చేస్తూ మద్రాస్చ కోర్టులో అప్పిల్ చేసింది. ఎగ్మోర్ కోర్టు తీర్పును సమర్థించిన మద్రాసు కోర్టు జయప్రద శిక్షకు అర్హురాలే అని చెప్పింది. దాంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
జయప్రద దాఖలు చేసిన పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. మద్రాసు కోర్టును కొట్టివేసింది. దీంతో జయప్రద ఊపిరి తీసుకుంది. థియేటర్ ఉద్యోగులకు జయప్రద ఈఎస్ఐసీ (ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్) కింద చెల్లించాల్సిన రూ.8,17,794 ల విషయంలో జయప్రద నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినట్టు థియేటర్ కార్మికులు ఫిర్యాదు చేశారు. దాంతో జయప్రద, ఆమె సోదరుడు రాజబాబు, బిజినెస్ పార్టనర్ రామ్ కుమార్ ముగ్గురి పైనా కేసు నమోదైంది. ఈ కేసులో వీరికి ఆరు నెలల జైలు శిక్ష విధించిన ఎగ్మోర్ కోర్టును సుప్రీంకోర్టులో సవాల్ చేసి గెలిచారు.