I will never do an item song like Oo Antavaa again.. Samantha
Samantha: పుష్ప చిత్రంలో ఊ అంటావా(OO Antava) పాట ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ పాట చేస్తున్న సేపు చాలా అసౌకర్యంగా ఉన్నానని నటీ సమంత(Samantha) సంచలన విషయాన్ని బయట పెట్టింది. ఇండియా టుడే కాంక్లేవ్ పాల్గొన్న సమంత తన గురించి చాలా విషయాలు పంచుకుంది. అల్లు అర్జున్‌తో అంతకు ముందు హీరోయిన్గా నటించాను కానీ స్పెషల్ సాంగ్ చేస్తున్నప్పుడు కాస్త ఇబ్బంది పడ్డట్లు చెప్పుకొచ్చింది. ఆ పాటకు ముందు ఫ్యామిలీ మ్యాన్ 2లో నటించింది. అందులో కూడా సమంత బోల్డ్‌గా నటించింది. అదే సమయంలో ఈ పాట ఆఫర్ రావడంతో చేయాలి అనుకున్నట్లు వెల్లడించారు.
మన చుట్టూ ఎక్కువమంది లేకపోవడమే మంచిది, ఎక్కువ మంది ఉంటే వారి అభిప్రాయాలను మనపై రుద్దుతారు అని తెలిపారు. ఇక తాను స్త్రీగా ఉన్నందుకు చాలా సందర్భాల్లో అసౌకర్యంగా ఫీల్ అయ్యేదట. తానెప్పుడు పూర్తి సౌకర్యంగా కానీ, విశ్వాసంతో కానీ లేదని చెప్పుకొచ్చింది. అంతేకాదు అందంగా లేనని, ఇతర అమ్మాయిల్లా కనిపించనని చాలా సార్లు అనుకొనే దాన్ని అని సమంత పేర్కొన్నారు. ఊ అంటావా పాట షూటింగ్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. “నా వరకు అది చాలా బిగ్ ఛాలెంజ్. సెక్సీ అనేది నాకు సరిపడని విషయం అన్నారు. అందుకే ఆ సమయంలో వణికిపోయాను. అలాంటి పరిస్థితుల నుంచి నటిగా, వ్యక్తిగా ఎదుగుతూ వచ్చాను’’ అని సమంత తెలిపారు. పుష్పలో చేసినట్లు మరో సాంగ్ చేస్తారా అంటే చేయను అని చెప్పుకొచ్చారు.