»Kriti Karbanda Is Married To Bollywood Hero Pulakith Samrat
Kriti Karbanda: హీరోను పెళ్లి చేసుకున్న కృతి కర్బందా
హీరోయిన్ కృతి కర్బందా తాజాగా పెళ్లి చేసుకుంది. బాలీవుడ్ హీరో పులకిత్ సామ్రాట్‌ను వివాహం చేసుకుంది. శుక్రవారం వీరి మ్యారెజ్ అవగా శనివారం బయటకు వచ్చింది.
Kriti Karbanda is married to Bollywood hero Pulakith Samrat
Kriti Karbanda: అందాల భామ కృతి కర్బందా(Kriti Karbanda) తాజాగా వివాహబంధంలోకి అడుగుపెట్టింది. బాలీవుడ్ హీరో పులకిత్ సామ్రాట్(Pulakith Samrat)తో కృతి ఏడడుగులు వేశారు. హర్యానాలోని గురుగ్రామ్‌లో నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, కొద్దిమంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. ఇక శుక్రవారం వీరి పెళ్లి జరిగినా.. ఒకరోజు ఆలస్యంగా శనివారం పెళ్లి పోటోలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇన్స్టాగ్రామ్ వేదికగా కృతి కర్భందా తన అభిమానులతో ఈ విషయాన్ని పంచుకుంది.
బోణీ చిత్రంతో తెలుగు వారికి పరిచయమైన ఈ భామ తరువాత ఒంగోలు గిత్త, ఓమ్, తీన్మార్, మిస్టర్ నూకయ్య సినిమాలు చేసింది. ఇక బ్రూస్ లీ చిత్రంలో రామ్ చరణ్ అక్కగా నటించిన తరువాత మళ్లీ తెలుగులో నటించలేదు. ప్రస్తుతం బాలీవుడ్లోనే బిజీగా ఉంది. ఈ టైమ్‌లో బాలీవుడ్ హీరో పులకిత్ సామ్రాట్‌తో వివాహం చేసుకుంది. ఆయన ఫుక్రే సినిమాతో ఎంట్రీ ఇచ్చి సనమ్ రే, పాగల్ పంటి సినిమాలతో గుర్తింపు పొందాడు.