చాలా రోజుల నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు హనుమాన్ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది. థియేటర్లో సూపర్ హిట్ అయిన హనుమాన్ చిత్రం ఓటీటీలో విడుదల అయింది.
Hanuman: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హనుమాన్(Hanuman) చిత్రం ఓటీటీ(OTT)లోకి వచ్చేసింది. శనివారం రాత్రి నుంచి హిందీ వర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prashanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12న థియేటర్లో విడుదలై మంచి విజయం సాధించింది. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 300 కోట్లకు పైగా వసుళ్లను చేసింది. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ చిత్రం ఓటీటీ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5తెలుగులో ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది.
పాన్ఇండియా సినిమాగా విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో కూడా అన్ని భాషాల్లో స్ట్రీమింగ్ అవుతుంది. అంజనాద్రి అనే ఉహాప్రపంచంలో హనుమంతు అనే కుర్రాడికి అనుకోకుండా కొన్ని శక్తులు వచ్చి సూపర్ హీరోగా మారుతాడు. విషయం తెలుసుకున్న విలన్ ఆ శక్తులకు గల కారణాలు తెలుసుకొని దాన్ని దొంగలించాలి అనుకుంటాడు. ఈ తరుణంలో వారిద్దరి మధ్య పోటీ సాగుతుంది. చివరికి ఏం జరిగింది. ఇద్దరిలో ఎవరు గెలిచారు అనేది కథ. దీనికి సీక్వెల్గా జై హనుమాన్ చిత్రం కూడా తెరకెక్కనుంది. ఈ మూవీ 2025లో వచ్చే అవకాశం ఉంది.