గ్రూప్-2 అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్-2 పోస్టులు తక్కువగా ఉన్నాయని అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు
ఈ పోస్టుల సంఖ్యను పెంచేందుకు ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే ఎన్ని పోస్టులు పెంచిందో ఇక్కడ చుద్దాం.
ఆంధ్రప్రదేశ్లో గ్రూప్-2 అభ్యర్థులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. గతంలో గ్రూప్-2లో 508 పోస్టుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే గ్రూప్-2లో పోస్టులు తక్కువగా ఉన్నాయని..వాటి సంఖ్యను పెంచాలంటూ చాలామంది అభ్యర్థులు ఏపీపీఎస్సీకి విజ్ఞప్తి చేశారు. అయితే అనేక మంది ఉద్యోగార్థుల వినతి మేరకు అదనంగా మరో 212 పోస్టులను చేరుస్తున్నట్లు ఏపీ సర్కార్ తాజాగా జీవోను విడుదల చేసింది. దీంతో మొత్తం గ్రూప్-2 పోస్టుల సంఖ్య ప్రస్తుతం 720కి పెరిగింది. ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కూడా వెంటనే మొదలుపెట్టాలని ఏపీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది.
ఏపీపీఎస్సీ గ్రూప్-2 పోస్టుల ఎంపిక ప్రక్రియతోపాటు పరీక్ష విధానం, సిలబస్ విశ్లేషణ, ప్రిపరేషన్ గైడెన్స్ వివరాలను త్వరలోనే ప్రకటించనుంది. మరికొన్ని రోజుల్లోనే గ్రూప్ 2 నోటిఫికేషన్స్ వస్తాయనే ఉద్దేశంతో ఇప్పటికే చాలామంది ప్రిపరేషన్ను మొదలుపెట్టేశారు. పూర్తి ఆబ్జెక్టివ్ తరహాలో ఉండే ఈ పరీక్షకు ప్రిలిమ్స్, మెయిన్స్ అనే రెండు దశలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఏపీలో ఎన్నికలకు ముందే ఈ నోటిఫికేష్ వచ్చే అవకాశం ఉంది.