E.G: జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో వినియోగదారుల్లో హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పించడంలో భాగంగా మంగళవారం రాజమండ్రిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి వీ.పార్వతి పాల్గొని మాట్లాడారు. వినియోగదారుల రక్షణ చట్టం–2019 ద్వారా కల్పించిన హక్కులను ప్రతి వినియోగదారుడు తెలుసుకోవాలని ఆయన సూచించారు.