జగిత్యాల జిల్లాలోని వయోవృద్ధుల పోషణ బాధ్యతను పిల్లలు విస్మరిస్తే జైలు శిక్ష, జరిమానా వంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో, వయోవృద్ధుల ట్రైబ్యునల్ ఛైర్మన్ పి.మధుసూదన్ హెచ్చరించారు. శనివారం ఆయన వయోవృద్ధుల సంక్షేమ చట్టం అవగాహన పత్రికలను ఆవిష్కరించారు. అనంతరం వృద్ధుల కేసుల విచారణలో కుమారులు, కోడళ్లకు పోషణ, వైద్య ఖర్చులు అందించాలని ఆయన సూచించారు.