ఎట్టకేలకు కాంగ్రెస్లో వైఎస్ షర్మిల (YS Sharmila) చేరిక రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. షర్మిలను ఏపీ సీఎం అభ్యర్థి ప్రకటించాలనేది కాంగ్రెస్ పార్టీ వ్యూహమని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమె రాకను తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) నేతలు కూడా స్వాగతిస్తున్నారు. కాగా షర్మిల ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ (Paleru Assembly) నియోజకవర్గం నుంచి లేదా క్రైస్తవులు ఎక్కువగా ఉన్న సికింద్రాబాద్ (Secunderabad) అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయొచ్చని ఇప్పటికే వార్తలు వచ్చాయి.ఏపీ లో షర్మిలతో పాదయాత్ర చేయించి తమకు దూరమైన ఎస్సీ, మైనారిటీ, ఎస్టీ వర్గాల ను, కొంతమేరకు రెడ్డి సామాజికవర్గాన్ని తమ వైపునకు తిప్పుకోవాలనేది కాంగ్రెస్ వ్యూహమని పేర్కొంటున్నారు.తద్వారా ముల్లుతోనే ముల్లుతోనే తీయాలి.. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలన్నట్టు.. కాంగ్రెస్ ను దెబ్బతీసి తమ ఓటు బ్యాంకును తన వైపుకు తిప్పుకున్న సీఎం జగన్ (CM JAGAN) కు షాక్ ఇవ్వాలనేదే కాంగ్రెస్ అధిష్టానం వ్యూహమని చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు వైసీపీ(YCP) కి ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్నాయి. ఈ సామాజికవర్గాల్లో అత్యధికులు వైసీపీ తోనే ఉన్నారని టాక్. గతంలో వీరంతా కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటగా ఉండేవారు. ఏపీలో దళిత ఓటు బ్యాంక్ ప్రస్తుతం జగన్ పార్టీకి అనుకూలంగా ఉందనే ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరితే ఈ ఓటు బ్యాంక్ చీలే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వైఎస్ఆర్ కుటుంబాన్ని అభిమానించే వాళ్లు కూడా రెండుగా చీలే ఛాన్స్ ఉంది. దీంతో ఏపీలో పాతాళానికి పడిపోయిన కాంగ్రెస్ పార్టీకి కొంత లాభం చేకూరనుంది.అయితే ఏపీ (AP) కాంగ్రెస్కు షర్మిల సారథ్యం వహిస్తే జగన్ సర్కార్కు గండంగా మారిన ప్రభుత్వ వ్యతిరేకత ఓటుతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలే అవకాశాలు కనిపిస్తున్నాయి.