ఏపీలో హాట్ టాపిక్ అవుతున్న పేరు శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్(CI Anjuyadav). తిరుపతి జిల్లాలో ఆమె తెలియని వారు ఉండరు. లేడీ గబ్బర్ సింగ్, లేడీ సింగంగా ఆమె పేరు తెచ్చుకున్నారు. ఇటీవల జనసేన పార్టి (Janasena party) కార్యకర్తపై సీఐ అంజూయాదవ్ చేయి చేసుకున్న వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం మారింది. దీంతో స్వయంగా జనసేన పార్టి అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతికి వచ్చి అంజూ యాదవ్ పై ఎస్పీ పరమేశ్వర రెడ్డి(SP Parameswara Reddy)కి పిర్యాదు చేశారు. దీంతో అంజూయాదవ్ టాపిక్ శ్రీకాళహస్తి నియోజకవర్గంతో పాటుగా, తిరుపతి జిల్లా(Tirupati District)లోనూ హాట్ టాపిక్ గా మారింది. త్వరలో సీఐ అంజూయాదవ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఐ అంజూ యాదవ్ ను అసెంబ్లీ బరిలో వైసీపీ (YCP) నిలుపుతోందనే చర్చ జోరుగా ప్రచారం జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తిరుపతి నుంచి బరిలోకి దిగుతారని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే అంజూ యాదవ్ ను పవన్ పై పోటీకి దించాలనేది వైసీపీ వ్యూహమని తెలుస్తున్నాది.గత ఎన్నికల సమయంలోనూ ఇలాగే అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్ పై కాలు దువ్వి నాటి సీఐ గోరంట్ల మాధవ్ (Gorantla Madhav) పాపులర్ అయ్యారు. తన తొడ కొట్టి జేసీ దివాకర్ రెడ్డికి సవాల్ విసిరారు. ఆ తర్వాత గోరంట్ల మాధవ్ ను వైసీపీ అధినేత జగన్ హిందూపురం పార్లమెంటు ఎన్నికల బరిలో దించారు. వైసీపీ గాలిలో గోరంట్ల మాధవ్ సునాయాసంగా గెలుపొందారు. సీఐ స్థాయి నుంచి ఏకంగా ఎంపీ అయిపోయారు.
ఇప్పుడిక అంజూ యాదవ్ వంతు వచ్చింది. ఆమె సైతం తన ప్రవర్తనతో గోరంట్ల మాధవ్ లానే తీవ్ర వివాదాల్లో కూరుకుపోయారు. గతంలో ప్రజలతో ఆమె దురుసుగా ప్రవర్తించిన వీడియోలు సోషల్ మీడియా(Social media)లో హల్చల్ చేశాయి. అయితే తమ ప్రత్యర్థులపై విరుచుకుపడిన ఆమెకు రాజకీయంగా ప్రమోషన్ కల్పించాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించినట్టు వార్తాలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తిరుపతి (Tirupati) శాసనసభ నుంచి అంజూ యాదవ్ వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని అంటున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పోటీకి సిద్ధంగా లేకపోవడం కూడా ఆమెకు కలసి వస్తుందని తెలుస్తున్నాది.ఎమ్మెల్యే కరుణాకరరెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థాన (TTD) చైర్మన్గా నియమించే అవకాశం ఉందని ఊహాగనలు వినిపిస్తున్నాయి