»Husband Bites Off Wifes Finger During Fight Then Swallows It
Viral news: ఇద్దరి మధ్య గొడవ.. భార్య వేలును కొరికిన భర్త
ఇద్దరి మధ్య గొడవలో భార్య వేలను కొరికి మింగేశాడు భర్త. 23 ఏళ్ల వైవాహిక జీవితంలో ఎన్ని చిత్రహింసలు పెట్టిన ఒక్క రోజు కూడా ఫిర్యాదు చేయలేదని భార్య అంటోంది.
Husband Bites Off Wife's Finger During Fight, Then Swallows It
Viral news: భార్యభర్తల గొడవలు(quarrels) అనగానే వర్షాకాలలంలో పడే ముసురులాగా సాధారణంగా తీసుకుంటారు. ఈ మధ్య జరుగుతున్న వివాదాలను అలా లైట్ తీసుకోవడానికి వీలు లేదు. భార్యభర్తల మధ్య పరస్పర దాడులు పెరిగాయి. ఈ మధ్యే చదివాము ఓ వివాహిత భర్త మర్మాంగాలను కొసేస్తే.. మరొకరు నాలుకను కొరికారు. ఇదే నేపథ్యంలో భార్య వేలు కొరికి మింగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూలై 28వ తేదీన కర్ణాటక(Karnataka)లోని కోనకుంటె పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరగింది భార్య పుష్ప ఫిర్యాదు మేరకు భర్త విజయ్‌కుమార్‌పై ఐపిసి సెక్షన్లు 506 (క్రిమినల్ బెదిరింపు), 498 ఎ (మహిళలపై క్రూరత్వం), 323 ( గాయపరచడం), 325 (తీవ్రమైన బాధ కలిగించినందుకు శిక్ష) కింద పోలీసులకు కేసు నమోదు చేశారు.
23 సంవత్సరాల పుష్ప (41) విజయ్‌కుమార్ వివాహ బంధంలో ఒక్కటయ్యారు. భర్త శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు వచ్చిందని డీసీపీ (సౌత్ డివిజన్) కృష్ణకాంత్ తెలిపారు. వీరిద్దరి మధ్య ఎప్పటినుంచో విభేదాలు ఉన్నాయని, అందుకే పుష్ప తన భర్త నుంచి విడిపోయి కొడుకుతో ఉంటుందని తెలిపారు. గత రెండు దశాబ్దాలుగా ఆమె వేధింపులకు గురవుతోందిని.. ఒక్కసారి కూడా ఫిర్యాదు చేయలేదని ఆమె బంధువు ఒకరు మీడియాకు తెలిపారు. డబ్బుకోసమే ఆమెను కొడుతున్నట్లు పేర్కొన్నాడు.
భార్య కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేశారు. కోననకుంటె పోలీసులు మెడికల్ సర్టిఫికేట్, డాక్టర్ అభిప్రాయం ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కుటుంబ సమస్య కాబట్టి నిందితుడిని అరెస్టు చేయలేదని, చట్టపరంగా విచారణ జరుగుతోందని డీసీపీ తెలిపారు.
చదవండి:Mallareddy: ఐటీ అధికారులు డబ్బులు ఉన్న గదిని చూడలే