»Heroines Fight With The Police But Not Believable
Niveda Pethuraj: పోలీసులతో హీరోయిన్ గొడవ.. కానీ నమ్మేలా లేదే?
హీరోయిన్ నివేదా పేతురాజ్ పోలీసులతో గొడవకు దిగినట్టుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.. ఈ గొడవ నిజంగా జరిగిందా? లేదా కావాలని పబ్లిసిటీ స్టంట్ కోసం చేసిందా? అనేది హాట్ టాపిక్‌గా మారింది.
Heroine's fight with the police.. but not believable?
Niveda Pethuraj: హాట్ బ్యూటీ నివేదా పేతురాజ్ పోలీసులతో గొడవ పడినట్టుగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో నివేదా కారును చెక్ చేయడానికి పోలీసులు ఆపగా.. కుదరదు అని పోలీసులతో వాగ్వాదానికి దిగింది నివేదా. రోడ్ వరకు వెళ్తున్నాను..పేపర్స్ అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి.. డిక్కీ ఓపెన్ చేయలేనని.. ఇది పరువుకు సంబంధించిన విషయం అని.. వీడియో ఎందుకు రికార్డింగ్ చేస్తున్నారని.. గొడవ పెట్టుకుంది. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. అయితే.. నివేదా నిజంగానే పోలీసులతో గొడవ పడిందా? లేదా ఇది పబ్లిసిటీ స్టంటా? అనేది హాట్ టాపిక్‌గా మారింది.
ఎందుకంటే.. ఈ మధ్య సినిమా ప్రమోషన్ కోసం కొత్త కొత్తగా ట్రై చేస్తున్నారు మేకర్స్. పైగా నివేదా పేతురాజ్ చేతిలో పెద్దగా సినిమాలు లేవు. చివరగా విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘దాస్ కా ధమ్కీ’లో నివేదా నటించింది. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. అలాంటి బ్యూటీని ప్రేక్షకులు దాదాపుగా మరిచిపోయినట్టైంది. మరి.. ఇప్పుడు మళ్లీ వైరల్ అవాలంటే డిఫరెంట్‌గా ట్రై చేయాల్సందే. అందుకే.. కొత్త సినిమా అనౌన్స్మెంట్ కోసం పోలీసులతో గొడవ పెట్టుకున్నట్టుగా ఏదైనా పబ్లిసిటీ స్టంట్ ప్లాన్ చేసిందా? అనే విషయాల్లో క్లారిటీ రావాల్సి ఉంది. కానీ నెటిజన్స్ మాత్రం ఇది సక్కా పబ్లిసిటీ స్టంట్ అని కామెంట్ చేస్తున్నారు. సినిమా కోసమే ఈ వీడియో వైరల్ అయ్యేలా చేస్తున్నారని అంటున్నారు. మరి దీనిపై నివేదా పేతురాజ్ ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.