Vijay Antony : ఇటీవల టాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకున్న హీరో ఆంటోనీ. ఆయన గత ఆరు నెలలుగా చెప్పులు(Slippers) వేసుకోవడమే మానేశారట. జీవితాంతం ఇక వేసుకోకూడదని అనుకుంటున్నట్లు ఆంటోనీ తెలిపారు. ఇంతకీ ఆయన తీసుకున్న ఆ నిర్ణయం వెనక ఉన్న కారణం ఏంటో తెలుసుకుందాం రండి.
విజయ్ ఆంటోనీ(Vijay Antony) నటించిన తుపాన్ సినిమా మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల మందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆయన ఓ ఇంటర్య్వూలో మాట్లాడారు. తాను చెప్పులు వేసుకోకపోవడానికి గల కారణాలను వివరించారు. తాను మొదట మూడు నెలల పాటు చెప్పులు లేకుండా నడవడం అలవాటు చేసుకున్నానని అన్నారు. అప్పుడు అంతా తాను ఏదో దీక్షలో ఉన్నానేమో అనుకున్నారని చెప్పుకొచ్చారు. అయితే ఆ సమయంలో తాను ఎప్పుడూ ఒత్తిడికి గురి కాలేదని అన్నారు.
స్ట్రెస్ లేకుండా ఉండటమే కాకుండా చెప్పులు లేకపోవడం వల్ల ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని విజయ్ ఆంటోనీ (Vijay Antony) చెప్పారు. అందువల్లనే తాను ఇక జీవితాంతం చెప్పులు వేసుకోకూడదని అనుకుంటున్నట్లు తెలిపారు. ఆయన నటించిన బిచ్చగాడు సినిమా తెలుగులో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దానికి సీక్వెల్గా వచ్చిన బిచ్చగాడు2 కూడా అంతే విజయం సాధించింది. అలాగే బిచ్చగాడు 3 సైతం కచ్చితంగా ఉంటుందని విజయ్ వెల్లడించారు. దాన్ని 2026 వేసవిలో విడుదల చేసేందుకు చూస్తున్నామని తెలిపారు.