ఇటీవల విజయ్ ఆంటోని ఇంట్లో జరిగిన విషాదాన్ని ఇంకా ఎవరు మరిచిపోలేదు. ఆయన పెద్ద కూతురు మీరా ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని, తల్లి దండ్రులకు తీరని శోకంలో పడేసింది. అయినా తన కొత్త చిత్రం రిలీజ్‌ను వాయిదా వేయకుండా రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు ఆంటోని తెలుగు ఫ్యాన్స్‌కు ఓ బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది.
కన్న కూతురు కళ్ల ముందే విగతజీవిలా పడి ఉండడం చూసి.. విజయ్ ఆంటోనితో పాటు అభిమానుల గుండే కూడా పగిలిపోయింది. ఆయనను ఓదర్చడం ఎవ్వరి వల్ల కాలేదు. కానీ కూతురు చనిపోయి శోక సంద్రంలో ఉన్న విజయ్ ఆంటోని.. వారం రోజులకే మీడియా ముందుకు వచ్చాడు. తన వల్ల తన సినిమా ఆగిపోవడానికి వీల్లేదని, నిర్మాతలు నష్టాల పాలు అవ్వకూడదని.. తన కొత్త చిత్రాన్ని రిలీజ్ చేశాడు. విజయ్ కొత్త చిత్రం రత్తం.
సిఎస్ ఆముధన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. అక్టోబర్ 6న రిలీజ్ అయింది. ఈ సినిమాను తన చిన్నకూతురు లారాతో కలిసి ప్రమోట్ చేశాడు విజయ్. దీంతో విజయ్ తన బాధ్యతను మరిచిపోలేదు.. విజయ్ గ్రేట్ అన్నారు. కానీ ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో అలరిచంలేకపోయింది. తమిళ్లో రిలీజ్ అయిన మూడు రోజులకు తెలుగులో కూడా రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కానీ, కొన్ని కారణాల వలన విడుదల చేయలేకపోయారు.
ఇక ఇప్పుడు తెలుగులో అసలు అవసరం లేదని భావిస్తున్నారట. ఈ సినిమాకు నెగెటివ్ రివ్యూస్ రావడంతో తెలుగులో రిలీజ్ చేసి అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయించడం ఎందుకనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. దీంతో రత్తం కోలీవుడ్‌కే పరిమితం కానుంది. సినిమా ఫ్లాప్, హిట్ అనే విషయాన్ని పక్కన పెడితే.. తెలుగులో విజయ్ ఆంటోని సినిమా చూడాలని అనుకున్న అభిమానులకు మాత్రం ఇది బ్యడ్ న్యూస్ అనే చెప్పాలి.