Rajeev Kanakala: ఎన్టీఆర్ అందుకే స్పందించలేదు: రాజీవ్ కనకాల
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్, రిమాండ్‌ను నిరసిస్తూ ఏపీతో పాటు తెలంగాణలో కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలతో పాటు ఐటీ ఉద్యోగులు, పలు సంఘాలు ఈ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. కానీ ఎన్టీఆర్ మాత్రం స్పందిచలేదు. తాజాగా దీనిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు రాజీవ్ కనకాల.
ఏపీ రాజకీయాలపై, చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ మౌనంగా ఉండటంపై సినీ నటుడు రాజీవ్ కనకాల షాకింగ్ కామెంట్స్ చేశారు. సినీ పరిశ్రమల్లో జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్‌గా రాజీవ్ కనకాల అందరికీ సుపరిచితుడే. తారక్ సినిమా స్టూడెంట్ నంబర్ వన్ మూవీ నుంచి మొన్నటి ఆర్ఆర్ఆర్ మూవీ వరకూ ఏదోక పాత్రలో రాజీవ్ కనకాల కనిపిస్తున్నారు. వారిద్దరి మధ్య పర్సనల్ బాండింగ్ ఎక్కువ.
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ఇక కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. నవంబర్‌లో ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఇద్దరు కూడా మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తో సంబంధం లేనట్టుగా.. స్పందించకుండా తమ తమ సినిమా పనులు చేసుకుంటూ పోతున్నారు. ఈ విషయం ఓ వర్గం నందమూరి ఫ్యాన్స్‌కు మండిపోయేలా చేసింది.
అసలు ఎన్టీఆర్ బాబు అరెస్ట్ పై ఎందుకు రెస్పాండ్ అవలేదు? అనేది అంతు చిక్కని విషయమే. తాజాగా యంగ్ టైగర్ సెలెన్స్‌గా ఉండడం పై రాజీవ్ కనకాల స్పందించారు. స్టూడెంట్ నెం.1 సినిమా నుంచి ఎన్టీఆర్, రాజీవ్ కనకాల మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉన్న సంగతి తెలిసిందే. అందుకే.. ఎన్టీఆర్ సినిమాల్లో రాజీవ్ కనకాల ఎక్కువగా కనిపిస్తుంటారు. ఇక ఇప్పుడు రాజకీయాలపై ఎన్టీఆర్ సైలెన్స్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నా లెక్క ప్రకారం అయితే.. తారక్ స్పందించక పోవడానికి గల కారణం సినిమాలు అయి ఉండవచ్చని అన్నారు.
ట్రిపుల్ ఆర్ సినిమా చేసే సమయంలో మూడు నాలుగు సినిమాలు చేసేవాడు. ఇప్పుడు దేవర కూడా రెండు భాగాలుగా చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఫోకస్ అంతా దేవర సినిమా మీదనే ఉంది. అందుకే రాజకీయాలు పై స్పందించలేదు.. అని నేను అనుకుంటున్నాని చెప్పుకొచ్చారు. మరి ఎన్టీఆర్ ఎప్పుడు స్పందిస్తాడో చూడాలి.