ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, తమన్‌తో కలిసి థియేటర్ బూజులు దులిపేశాడు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. కానీ ఈ సినిమా లాభాలు తేవడం కష్టమే. తాజాగా స్కంద ఓటిటి డేట్ లాక్ అయినట్టుగా తెలుస్తోంది.
స్కంద సినిమా చూసి.. థియేటర్ నుంచి బయటికొచ్చేటప్పుడు.. అరే మావా ఇదేం మాస్.. ఇదేం నరుకుడు.. అని అనుకున్నారు ఆడియెన్స్ అంతా. మాస్ యందు బోయపాటి మాస్ వేరన్నట్టు.. స్కందను ఊరమాస్‌గా తెరకెక్కించాడు బోయపాటి. మాస్ డోస్ ఎక్కువవడంతో.. జనాలు తట్టుకోలేకపోయారు. పైగా ఈ సినిమా క్లైమాక్స్‌లో సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేశాడు. దీంతో బాబోయ్.. ఇంత మాస్ సినిమాకు సెకండ్ పార్ట్ అవసరమా? అని ఫీలయ్యరు ఆడియెన్స్. ఇప్పుడదే నిజమైనట్టుగా తెలుస్తోంది.
ఈ సినిమాకు ఓపెనింగ్స్ బాగానే వచ్చినప్పటికీ వసూళ్లు మాత్రం అనుకున్న రేంజ్లో రాలేదు. దీంతో స్కందకు నష్టం తప్పదంటున్నారు. అందుకే.. స్కంద సీక్వెల్ క్యాన్సిల్ అయినట్టుగా తెలుస్తోంది. బోయపాటి నుంచి వచ్చేది అఖండ సీక్వెల్ మాత్రమేనని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికైతే.. స్కంద 2 వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ 28న రిలీజ్ అయిన ఈ సినిమా.. తాజాగా ఓటిటి డేట్ లాక్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆల్మోస్ట్ థియేట్రికల్ రన్ క్లోజింగ్‌కు వచ్చేసింది స్కంద.
దీంతో ఈ నెల అక్టోబర్ 27 నుంచి ఓటిటిలోకి స్ట్రీమింగ్కి రానున్నట్టుగా తెలుస్తుంది. అంటే.. నెల రోజుల్లోనే ఈ మాస్ మూవీ ఓటిటిలోకి రాబోతోందన్న మాట. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటిటి సంస్థ డిస్నీ+ హాట్ స్టార్ వారు సొంతం చేసుకున్నారు. అతి త్వరలోనే ఓటిటి డేట్ ప్రకటించనున్నారు. మరి థియేటర్లో ఊచకోత అనిపించుకున్న ఈ సినిమా.. ఓటిటిలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.