విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సైంధవ్. హిట్ సినిమాల డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ మూవీ టీజర్ డేట్ వచ్చేసింది.
Victory Venkatesh, Shailesh Kolanu Combo Saindhav Movie Teaser Date Arrived
Victory Venkatesh: విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), హిట్ (Hit) సిరీస్ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను (Sailesh Kolanu) కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం సైంధవ్(Saindhav). నిహారిక ఎంటర్టైన్మెంట్ (Niharika Entertainment) బ్యానర్‌పై పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. రీసెంట్గా ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు తెలుపుతూ టీజర్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు.
సైంధవ్(Saindhav) మూవీ టీజర్‌ను అక్టోబర్ 16న విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెరెమియా, బేబీ సారా లాంటి భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులకు మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు విడుదలైన అన్ని పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇక టీజర్ విడుదల అవడంతో ఆడియన్స్‌లో మరింత ఇంట్రెస్ట్ పెరుగుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇది కచ్చితంగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అవుతుందని, వెంకటేష్ ఫ్యాన్స్‌కు గుర్తుండిపోయే సినిమాగా నిలుస్తుందని ఇప్పటికే విడుదలైన పోస్టర్లను చూస్తుంటే చెప్పవచ్చు. అలాగే డైరెక్టర్ శైలేష్ కొలను గతంలో తీసిన సినిమాలన్నీ సస్పెన్స్ థ్రిల్లర్స్. దీన్ని బట్టి చూసుకుంటే సైంధవ్ చిత్రం కచ్చితంగా ఒక యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతుంది. అక్టోబర్ 16న టీజర్ విడుదలైతే కథ ఎలా ఉండబోతుందో కొంత వరకు అంచనా వేసే అవకాశం ఉంది. మరి ఇప్పటి వరకు ఫ్యామిలీ హీరోగా ముద్ర వేసుకున్న వెంకటేష్ ఈ మధ్యే కాస్త ప్రయోగాలు చేస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకులకు ఎంత మేరకు మెప్పిస్తుందో చూడాలి.