»Varun Tej Lavanya Tripathi Wedding Date Fixed Mega And Allu Families Will Go To Italy
Varun Tej-Lavanya: పెళ్లి ఫిక్స్.. డెస్టినేషన్ వెడ్డింగ్ ఎక్కడంటే..?
ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల వరుసలో వరుణ్-లావణ్య చేరబోతున్నారు. వీరి వివాహానికి ముహుర్తం ఫిక్స్ అయిందని, ఆ వెడుకకు 10 రోజుల పాటు మెగా ఫ్యామిలీ వెళ్లనుందని తెలుస్తోంది.
Varun Tej-Lavanya Tripathi wedding date fixed.. Mega and Allu families will go to Italy
Varun Tej-Lavanya: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej), నటి లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) పెళ్లి చర్చ మరోసారి తెరమీదకు వచ్చింది. ఇప్పటికే ఇద్దరు తమ బ్యాచ్లర్ పార్టీని స్పెయిన్లో జరుపుకున్నారు. వీరి వివాహ వేడుక అతి త్వరలో జరగనుంది. నవంబర్ 1న నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇటలీ(Italy)లోని టుస్కానీ వద్ద నున్న బోర్గో శాన్ ఫెలోస్ రిసార్ట్(Borgo San Felos Resort) లో మ్యారెజ్ చేసుకోబోతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఈ విషయంపై నాగబాబు, ఇతర కుటుంబ సభ్యులు ఎవరు స్పందించలేరు. ఇదే ఖాయమని.. అందుకోసం చిరంజీవి (Chiranjeevi,), రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, పవన్ కల్యాణ్(Pawan Kalyan)లతో పాటు మరికొంత మంది సన్నిహితులు ఇటలీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ చివరి వారంలో మెగా, అల్లు కుటుంబాల సభ్యులు టుస్కానీకి ప్రయాణం అవుతున్నట్లు తెలుస్తుంది.
వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం ఈ ఏడాది జూన్ 9న హైదరాబాద్ లో జరిగింది. పెద్దగా హడావిడిగా కాకుండా కేవలం కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. పెళ్లికి కూడా పరిమితంగా అతిథులను ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. రిసార్ట్లో హల్దీ, మెహందీ, సంగీత్ లాంటి కార్యక్రమాలతో 4 రోజుల పాటు వివాహ వేడుక జరగనుంది. అనంతరం బంధు మిత్రులకు పార్టీ ఇస్తారని తెలిసింది. హైదరాబాద్లో రిసెప్షన్ ఏర్పాటు చేస్తారని సమాచారం.