మాస్ మహారాజా పాన్ ఇండియా టార్గెట్ చేస్తూ.. చేస్తున్న ఫస్ట్ సినిమా టైగర్ నాగేశ్వర రావు(Tiger Nageswara Rao). దసరాకు రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు.. ప్రమోషన్స్ ఓ రేంజ్లో జరుగుతున్నాయి. కానీ సినిమా రన్ టైమ్ మాత్రం కాస్త రిస్కీగా ఉంది.
Tiger Nageswara Rao runtime Is Ravi Teja taking a risk
ఒక హిట్ ఒక ఫ్లాప్ అన్నట్టుగా దూసుకుపోతున్న మాస్ మహారాజా రవితేజ(Ravi Teja).. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావుగా ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 20న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా రన్‌టైమ్ బయటికొచ్చింది. మూడు గంటల ఒక నిమిషం రన్టైమ్తో టైగర్ నాగేశ్వర రావు ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇదే నిజమైతే.. రన్‌టైమ్ పరంగా రవితేజ కెరీర్లో ఇదే పెద్ద సినిమా కానుంది. కానీ ఈమధ్య కాలంలో ఆడియెన్స్‌ను థియేటర్లో కూర్చొబెట్టాలంటే.. రెండు, రెండున్నర గంటలే ఎక్కువ. ఓ కమర్షియల్ సినిమాకు ఈ రన్ టైం పర్ఫెక్ట్గా ఉంటుంది.
కానీ రాజమౌళి లాంటి బడా డైరెక్టర్ల సినిమాలు దాదాపు మూడు గంటల నిడివితో ఉంటాయి. అయినా కూడా ప్రేక్షకుల సహనాన్ని పరిక్షీంచేలా కొన్ని సినిమాలు లాంగ్ రన్‌టైంతో వస్తాయి. హిట్ టాక్ వస్తే ఓకె కానీ రిజల్ట్ ఏ మాత్రం తేడా కొట్టినా సరే.. మళ్లీ కత్తెరకు పని చెప్పాల్సి ఉంటుంది. అయితే.. టైగర్ నాగేశ్వర రావు(Tiger Nageswara Rao) బయోపిక్ కాబట్టి.. కథ మొత్తం చూపిండానికి ఇంత లాంగ్ రన్ టైం(run time) లాక్ చేసినట్టున్నారు. అయినా కూడా ఇది రిస్క్ అనే చెప్పాలి. ఇక పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాతో పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ రీ ఎంట్రీ ఇస్తోంది. మరి లాంగ్ రన్ టైంతో వస్తున్న టైగర్ నాగేశ్వర రావు ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.