Director Lokesh Kanakaraj visited Tirumala on foot during the release of Vijay Leo
Lokesh Kanakaraj: విజయ్ నటించిన లియో (LEO) చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) తిరుమలకు వచ్చారు. తన టీమ్‌తో కలిసి బుధవారం రాత్రి కాలినడక మార్గం గుండా తిరుమల చేరుకున్నారు. ఈ రోజు ఉదయం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తరువాత మీడియాతో మాట్లాడారు. తాను దర్శకత్వం వహించిన లియో మూవీ విజయంతం కావాలని ఆ దేవుడిని ప్రార్థించానని తెలిపారు.
హీరో విజయ్ – లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ లియో మూవీపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. త్రిష కథానాయిక. అర్జున్ సర్జా, సంజయ్ దత్, అర్జున్ దాస్, గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రియా ఆనంద్ ఈ సినిమాలో నటించారు. సెన్సెషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందించారు. ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. అక్టోబర్ 19వ తేదీన లియో మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.