Game Changer: ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్.. క్లారిటీ అప్పుడే?
ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. అయితే.. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. కానీ అప్పటి వరకు ఆగితే గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ తెలుస్తుందని అంటున్నారు.
Game Changer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. శంకర్ మార్క్ పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అయితే.. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. అక్టోబర్‌లో రిలీజ్ ఉంటుందని మేకర్స్ చెబుతున్నప్పటికీ.. అధికారిక ప్రకటన మాత్రం రావడం లేదు. అయితే.. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ రావాలంటే.. ఇండియన్ 2 రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందేనని అంటున్నారు. జులై 12న ఇండియన్ 2 రిలీజ్ కానుంది.
ఆ తర్వాతే శంకర్ ‘గేమ్ చేంజర్’ పై పూర్తి స్థాయిలో ఫోకస్ చేయనున్నట్టుగా చెబుతున్నారు. అలాగే.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాతే ఈ మూవీ రిలీజ్ డేట్ పై పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోను ఈ ఏడాదిలోనే గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. కుదిరితే.. అక్డోబర్ ఎండింగ్లో విడుదల అయ్యే అవకాశంది. లేదు దేవర ముందుకి వెళితే.. అక్టోబర్ 10న దసరా కానుకగా రిలీజ్ అయిన అవ్వొచ్చని అంటున్నారు. అయితే.. ఎప్పుడొచ్చిన కూడా పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న గేమ్ చేంజర్ పై భారీ హైప్ ఉంది. అలాగే.. ఇండియన్ 2 హిట్ అయితే గేమ్ చేంజర్ పై అంచనాలు పీక్స్‌కు వెళ్లనున్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా చరణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నారు మెగాభిమానులు. మరి శంకర్ ఏం చేస్తాడో చూడాలి.