సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో కలిసి చేస్తున్న మూడో సినిమా 'గుంటూరు కారం'. ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేయబోతున్నాడు. అందుకే.. ఇప్పటి నుంచే గట్టిగా కసరత్తులు చేస్తున్నాడు మహేష్.
అతడు, ఖలేజా తర్వాత పుష్కర కాలానికి సెట్ అయిన మహేష్, త్రివిక్రమ్ క్రేజీ కాంబో.. ఈ సారి సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న గుంటూరు కారం రిలీజ్ కానుంది. ఈ సినిమా గురించి ఎన్ని రూమర్స్ వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర మోత మామూలుగా ఉండదని ప్రొడ్యూసర్ నాగ వంశీ నమ్మకంగా చెప్తున్నాడు. కాబట్టి.. గుంటూరు కారం హిట్ గ్యారెంటీ అంటున్నారు. ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు మహేష్ బాబు. ఈ సినిమా కోసం రెండు మూడేళ్ల సమయాన్ని కేటాయించనున్నాడు.
అయితే రాజమౌళి సినిమా అంటే ఎంతో హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. బాహుబలి కోసం ప్రభాస్, ట్రిపుల్ ఆర్ కోసం ఎన్టీఆర్, చరణ్ ఎంతలా కష్టపడ్డారో అందరికి తెలిసిందే. కాబట్టి.. ఇప్పటి నుంచే రంగంలోకి దిగిపోయాడు మహేష్. హీరో అంటే ఎంత ఫిట్ అండ్ యంగ్ కనిపించడం వెనుక ఇంత కష్టం ఉంటుంది.. అనేలా మహేష్ బాబు షేర్ చేసిన లేటెస్ట్ జిమ్ ఫోటో చూస్తే అర్థమవుతోంది.
తాజాగా ఇన్‌స్టాలో షేర్ చేసిన మహేష్ లేటెస్ట్ జిమ్ పోస్ట్ తెగ వైరల్ అవుతున్నాయి. బైసెప్స్ చూపిస్తూ.. పర్ఫెక్ట్ చెస్ట్ మైంటైన్ చేస్తూ మహేష్ పెట్టిన పోస్ట్ ఘట్టమనేని అభిమానులకి పండగ చేసుకునేలా ఉంది. గత కొన్ని నెలలుగా బాడీ పెంచే పనిలో ఉన్న మహేష్ బాబు, పర్ఫెక్ట్ టోన్డ్ బాడీ షేప్ లోకి వస్తున్నట్లుగా ఉన్నాడు. లేటెస్ట్ ఫోటో చూసిన తర్వాత.. పండుగాడు కొడితే.. దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవడం గ్యారెంటీ.