»Brahmanandam Who Wrote The Autobiography Was Honored By The Megastar
Brahmanandam: ఆత్మకథ రాసిన బ్రహ్మానందం.. సన్మానించిన మెగాస్టార్
తెలుగు చిత్ర పరిశ్రమలోని టాప్ కమెడియన్ బ్రహ్మానందం తన ఆత్మకథను అక్షరరూపంలో మలిచారు. ఆత్మకథ రాసిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్వయంగా బ్రహ్మానందంను ఇంటికి పిలిచి శాలువాతో సత్కరించారు.
టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం తన ఆత్మకథ రాశారు. పుస్తరూపంలో తన ఆత్మకథను ఆవిష్కరించారు. తాజాగా బ్రహ్మానందం ఆత్మకథ పుస్తకం మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ తరుణంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తనకు ప్రియమైన బ్రహ్మానందంకు అభినందనలు తెలిపారు. తన ఇంటికి బ్రహ్మానందాన్ని ఆహ్వానించి శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. తనకెంతో ఆప్తుడు అయిన బ్రహ్మానందం ఎన్నో విషయాలతో కూడిన తన ఆత్మకథను పుస్తకరూపంలోకి తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు. బ్రహ్మానందం అక్షర రూపంలో పుస్తకాన్ని తీసుకురావడం ఎంతో అభినందనీయమని, ఆ పుస్తకాన్ని అందరూ కొని చదవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఒకనాడు బ్రహ్మానందం ఒక విషయం చెప్పాడని మెగాస్టార్ సోషల్ మీడియా వేదిక ఆ విషయాన్ని పంచుకున్నారు. ఒకరి అనుభవం మరొకరికి పాఠ్యాంశం కావొచ్చని, మార్గదర్శకం అవ్వొచ్చని, బ్రహ్మానందం ఆత్మకథ పుస్తకం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం అవుతుందని, వెలకట్టలేని అనుభూతిని ఇస్తుందని మెగాస్టార్ అన్నారు. పుస్తక ప్రచురణకర్తలైన అన్వీక్షికి వారికి అభినందనలు తెలియజేశారు.