Ayodhya Ram Mandhir: చేరుకున్న 620 కిలోల బరువున్న గంట
జనవరి 22న అయోధ్య రామాలయంలో రాముడి విగ్రహా ప్రాణ ప్రతిష్టకు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈక్రమంలో అయోధ్యకు 620 కిలోల బరువున్న గంట కూడా చేరుకుంది.
Ayodhya Ram Mandhir: అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠకు అన్నిపనులు పూర్తి అవుతున్నాయి. నూతనంగా నిర్మిస్తున్న ఈ రామాలయంలో 620 కిలోల బరువున్న గంటను అమర్చాలని అనుకుంటున్నారు. ఈక్రమంలో ఆ గంటను తమిళనాడులో ప్రత్యేకంగా తయారు చేశారు. ప్రస్తుతం ఈ గంట అయోధ్యకు చేరుకుంది. ఆలయంలో నిర్మాణ పనులు పూర్తయిన అనంతరం ఈ గంటను అమర్చనున్నారు. ఈ గంటపై జై శ్రీరాం అని రాసి ఉంది.
జనవరి 22న అయోధ్య రామాలయంలో రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్టకు ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ విగ్రహ ప్రతిష్ఠకు కాశీ నుంచి గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్, లక్ష్మీకాంత్ దీక్షిత్ ప్రాణ ప్రతిష్ఠా పూజను నిర్వహిస్తారని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ప్రతిష్ఠాపన కార్యక్రమం అనంతరం విశ్వప్రసన్న తీర్థ జీ నేతృత్వంలో 48 రోజుల పాటు మండల పూజలు జరుగుతాయని ట్రస్ట్ పేర్కొంది.
ఇది కూడా చూడండి: Vijayakanth: కెప్టెన్ మృతిని తట్టుకోలేకపోతున్నాను.. బోరుమన్న విశాల్