First Glimpse: ప్రభాస్, మారుతి నుంచి ఫస్ట్ గ్లింప్స్?
బాహుబలి తర్వాత అన్నీ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నాడు ప్రభాస్. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కాయి. అందుకే మధ్యలో మారుతితో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. తాజాగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
First Glimpse: ప్రస్తుతం థియేటర్లో సలార్ హవా నడుస్తోంది. ఇప్పటికే 500 కోట్లకు పైగా రాబట్టింది సలార్. సెకండ్ వీకెండ్‌తో సలార్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవనుంది. ఇక ప్రజెంట్ సెట్స్ పై ఉన్న సినిమాల్లో ‘కల్కి’ దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో పాన్ వరల్డ్ రేంజ్లో తెరకెక్కుతోంది. అయితే.. ఈ భారీ ప్రాజెక్ట్స్ మధ్యలో మారుతితో ఓ సినిమా కమిట్ అయ్యాడు డార్లింగ్. మొదట్లో.. అసలు మారుతితో ప్రభాస్ సినిమా చేయడం ఏంటి? అనే కామెంట్స్ వినిపించాయి.
కానీ అన్నీ భారీ ప్రాజెక్స్ట్ కాబట్టి.. మధ్యలో మీడియం రేంజ్ బడ్జెట్‌తో ఈ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. అయినా కూడా ఈ సినిమాకు దాదాపు 300 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్టుగా టాక్ ఉంది. అయితే.. ఇప్పటి వరకు కనీసం అనౌన్స్మెంట్ కూడా ఇవ్వలేదు మారుతి. అనధికారికంగా సైలెంట్‌గా షూటింగ్ మాత్రం చేస్తున్నాడు. ఇప్పటికే చాలావరకు షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేశాడు.
ఇటీవలె బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయినట్టుగా వార్తలొచ్చాయి. కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం బయటికి రావడం లేదు. అయితే.. ఇప్పుడు ఆ టైం రానే వచ్చేసిందని అంటున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ సినిమా నుంచి ఏకంగా ఫస్ట్ గ్లింప్స్‌ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట మారుతి. సంక్రాంతి కానుకగా ఈ గ్లింప్స్ బయటికి రానుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం.. మారుతి అదే పనిలో ఉన్నాడట. అయితే.. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. మరి ఇప్పటికైనా ప్రభాస్, మారుతి సినిమా నుంచి అప్డేట్ ఉంటుందేమో చూడాలి.
ఇది కూడా చూడండి: Ram Mandir Inauguration: రాముడి విగ్రహ ప్రతిష్టాపనలో మోడీతో పాటు ఆ నలుగురు.. వారెవరంటే ?