Bellamkonda Sai Sreenivas: బెల్లకొండ సాయి శ్రీనివాస్ చివరగా ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమాను హీందీలో రిమేక్ చేసి ఫ్లాప్ అందుకున్నాడు. ఈ సినిమాతో మాస్ హీరోగా బాలీవుడ్లో సెటిల్ అవాలని అనుకున్నాడు.. కానీ ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో అప్ కమింగ్ మూవీస్‌తో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి హీరోతో ‘భీమ్లా నాయక్’ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయిన సంగతి తెలిసిందే. 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ మరియు సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ని రిలీజ్ చేశారు. ఈ రోజు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బర్త్ డే సందర్భంగా టైటిల్ రివీల్ చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్లో 10వ ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ చిత్రానికి ‘టైసన్ నాయుడు’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఇక గ్లింప్స్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ మరోసారి మాస్ సినిమా చేస్తున్నాడని చెప్పేశారు. ఒక బాక్సర్‌గా, పోలీస్ ఆఫీసర్‌గా టైసన్ నాయుడుగా బెల్లంకొండ కనిపిస్తున్నాడు.
‘సార్.. బాగా బలిసిన దున్నపోతు రంకెలు వేస్తూ మీ ముందుకు వచ్చింది. మీరు గాల్లో ఎగురుతూ ఒక బ్లైండ్ క్లిక్ ఇచ్చారు. అప్పుడు ఏం జరుగుతుంది? అనే డైలాగ్‌తో గ్లింప్స్‌కు మాస్ టచ్ ఇచ్చారు. బెల్లంకొండ యాక్షన్ అదుర్స్ అనేలా టైసన్ నాయుడు గ్లింప్స్ ఉంది. ఇక ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తుండగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా పని చేస్తున్నారు. విజయ్, వెంకట్ మరియు రియల్ సతీష్ మాస్టర్లు యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. మరి టైసన్ నాయుడు ఎలా ఉంటుందో చూడాలి.