»Viral Video Food Delivery On Horse With Petrol Difficulties Video Going Viral
Viral Video: పెట్రోల్ కష్టాలు గుర్రంపై ఫుడ్ డెలివరీ.. వైరల్ అవుతున్న వీడియో!
భారత న్యాయ సంహిత చట్టంలోని నిబంధనల మార్పుల వల్ల ట్రక్కు డ్రైవర్లు నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో పలు నగరాల్లో పెట్రోల్ బంక్ల వద్ద జనాలు బారులు తీరారు. దీంతో ఓ డెలివరీ బాయ్ గుర్రం మీద ఫుడ్ డెలివరీ చేశాడు.
Viral Video: భారత న్యాయ సంహిత చట్టం డ్రైవర్లనే కాదు.. ప్రజలను కూడా తీవ్ర ఇబ్బందులు పెట్టింది. ఎందుకంటే ఈ చట్టానికి వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్లు సమ్మె చేపట్టడంతో ప్రజలకు పెట్రోల్, డీజిల్ దొరక్క్ తీవ్ర అవస్థలు పడ్డారు. బంక్ల ముందు పెట్రోల్, డీజిల్ లేదనే బోర్డ్ దర్శనమిస్తుంది. ఎక్కడైతే పెట్రోల్ దొరుకుతుందో అక్కడ జనాలు బారులు తీరారు. ఇంధనం కోసం గంటల తరబడి క్యూలో నిల్చున్నారు. కానీ ఇంధనం దొరకని పరిస్థితి.
ఇలా గంటలు తరబడి పెట్రోల్ కోసం కాపు కాసి.. ఓ ఫుడ్ డెలివరీ చివరకు విసుగు చెంది గుర్రాన్ని ఆశ్రయించాడు. గరంలోని రోడ్లపై గుర్రంపై వెళ్లి ఫుడ్ డెలివరీ చేశాడు. ఈ ఘటన హైదరాబాద్లోని చంచల్గూడ ప్రాంతంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అయితే కొందరు నెటిజన్లు ఈ వీడియోను చూసి ఇది కేవలం బిజినెస్ ట్రిక్, అందరినీ ఆకర్షించడానికి మాత్రమే ఇలా చేశారని అంటుంటే.. మరికొందరు ఇలా గుర్రంపై వెళ్లడం వల్ల పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని కామెంట్లు చేస్తున్నారు.