NZB: వర్ని మండలంలో సర్పంచి ఎన్నికల ప్రక్రియలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో సూచించారు. గురువారం తహశీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్నికల పోటీ అభ్యర్థుల వివరాలు, బూత్ల సంఖ్య అడిగి తెలుసుకొన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సాయిలు పాల్గొన్నారు.