ఏలూరు జిల్లా వ్యాప్తంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.0 కార్యక్రమం 1,748 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ గురువారం తెలిపారు. నూజివీడు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి పాల్గొంటారన్నారు.