VZM: ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి గురువారం అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు.ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి పనులకు నిధులు, తాగునీటి సమస్య పరిష్కారం,CMRF కి సంబంధించిన అంశాలపై వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు సమస్యల పరిష్కారానికి సీఎం సానుకూలంగా స్పందించారని, తుఫాన్ సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్నందుకు అభినందించారని MLA తెలిపారు.