కర్నూలు నుంచి విజయవాడకు రైళ్ల సౌకర్యాలు అత్యవసరమని, రైల్వే మినిస్టర్కు వినతిపత్రం ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ ఢిల్లీలో ఆ పార్టీ ఎంపీ సచ్చితా నందను కోరారు. ఈ మేరకు వినతిపత్రం అందించారు. కర్నూలు-విజయవాడ మధ్య ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నా రైళ్లు తక్కువగా ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.