MBNR: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పోస్టల్ బ్యాలెట్ల జారీ, పంపిణీలో రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని నిన్న కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. కలెక్టరేట్లో నోడల్, రిటర్నింగ్, జోనల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో చిన్న పొరపాటు జరిగినా తీవ్ర సమస్యలకు దారితీస్తుందని ఆమె అధికారులను హెచ్చరించారు.