MHBD: డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఆక్రమించిన ఘటనలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బొల్లం అశోక్, తొర్రూరు పట్టణ కార్యదర్శి కొమ్మనబోయిన యాకయ్యలను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. జడ్జి ఆదేశాల మేరకు మహబూబాబాద్ సబ్ జైలుకు తరలించారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో భాగంగా మిగిలిన వారిని కూడా త్వరలో రిమాండ్కు తరలిస్తామని ఎస్సై ఉపేందర్ తెలిపారు.