GDWL: ఆదిశిల క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి (తిమ్మప్ప స్వామి) జాతర సందర్భంగా జిల్లా ఎస్పీ టి.శ్రీనివాసరావు గురువారం భద్రతా ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. భక్తుల రద్దీ భారీగా ఉండే అంచనా నేపథ్యంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆయన సూచనలు చేశారు.