వరంగల్ కలెక్టర్ ఆధ్వర్యంలో HCL టెక్నాలజీస్ వారు నిర్వహిస్తున్న HCL-టెక్-బీ ప్రోగ్రాం కోసం రేపు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు DIEO శ్రీధర్ సుమన్ తెలిపారు. 2024-25లో ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు, 2026లో పాస్ కాబోతున్న ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, ఒకేషనల్ విద్యార్థులకు ఈనెల 6న HNK అంబేడ్కర్ విగ్రహం వద్ద మెగా జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.