KMM: గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎటువంటి ఘర్షణలకు తావు లేకుండా పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో నిశితంగా పర్యవేక్షించాలని CP సునీల్ దత్ అన్నారు. పోలీస్ స్టేషన్ సెక్టర్ అధికారులు, స్టేషన్ హౌస్ ఆఫీసర్స్‌తో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా నిన్న గ్రామపంచాయతీ ఎన్నికల బందోబస్త్‌పై సమీక్ష నిర్వహించారు. గ్రామాలలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవన్నారు.