ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలిసి చేసిన డార్క్ సెంట్రిక్ మూవీ సలార్‌కు భారీ వసూళ్లు వస్తున్నాయి. డిసెంబర్ 22న రిలీజ్ అయిన సలార్ మూవీ ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ చేసుకుంది. మరి సలార్ మొదటి వారం వసూళ్లు ఎలా ఉన్నాయి?
Salaar: ప్రభాస్ కంబ్యాక్ ఇచ్చిన సలార్ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తొలిరోజే 178 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ మూవీ.. వీకెండ్ పూర్తికాకముందే ఆరు రోజుల్లోనే 500 కోట్ల క్లబ్లో చేరింది. నార్త్‌లో షారుక్ ఖాన్ ‘డంకీ’ సినిమాతో గట్టి పోటీ ఎదురైనా కూడా.. దాన్ని వెనక్కినెట్టి మరీ సలార్ రెట్టింపు వసూళ్లను రాబట్టింది. మొత్తంగా వరల్డ్ వైడ్‌గా ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేసరికి 542 కోట్లు కొల్లగొట్టింది సలార్. ఇండియాలో 350 కోట్ల వరకు రాబట్టిందని అంటున్నారు. ఒక్క హిందీలోనే 110 కోట్లకు పైగా నెట్ వసూళ్లను రాబట్టింది. తెలుగులో 125 కోట్లకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది.
ఇక ఓవర్సీస్లో సలార్ ర్యాంపేజ్ మామూలుగా లేదు. ఒక్క నార్త్ అమెరికాలోనే 7.5 మిలియన్ డాలర్స్ క్రాస్ చేసింది. మొత్తంగా ఓవర్సీస్లో 13 మిలియన్స్ రేంజ్లో సలార్ కలెక్షన్స్ ఉన్నాయి. కానీ కర్ణాటక, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో సలార్ కలెక్షన్ల పరంగా కొంత నిరాశపరిచింది. అయినా కూడా.. ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ వీక్‌లో 542 కోట్లు రాబట్టింది సలార్. ఇక సలార్ సినిమాతో మూడుసార్లు 500 కోట్ల వసూళ్లు అందుకున్న ఏకైక సౌత్ హీరోగా ప్రభాస్ నిలిచాడు. ప్రస్తుతం సలార్‌కి లాంగ్ వీకెండ్ ఉండడంతో కచ్చితంగా కలెక్షన్స్ పెరుగుతాయి అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. పైగా తెలుగుతోపాటు హిందీలోనూ ఈ వీకెండ్ పెద్ద సినిమాలు ఏవి రిలీజ్ కావడం లేదు. దీంతో ఈ వీకెండ్ సలార్ బ్రేక్ ఈవెన్‌కి కీలకంగా మారింది. మరి లాంగ్ రన్లో సలార్ ఎంత రాబడుతుందో చూడాలి.