»Ram Charan Ram Charan On Ntrs Way A Huge Project In Bollywood
Ram Charan: ఎన్టీఆర్ దారిలో రామ్ చరణ్.. బాలీవుడ్లో భారీ ప్రాజెక్ట్?
ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో సినిమాలు చేస్తున్నారు. అలాగే బాలీవుడ్లో కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ కమిట్ అవుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ 'వార్2' కమిట్ అవగా.. ఇప్పుడు చరణ్ 'ధూమ్ 4'లో నటించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
Ram Charan: ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. దీంతో ఈ ఇద్దరు అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టే.. నెక్ట్స్ భారీ లైనప్ సెట్ చేసుకున్నారు చరణ్, తారక్. ఆర్ఆర్ఆర్ తర్వాత స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ‘గేమ్ చేంజర్’ సినిమా చేస్తున్నాడు చెర్రీ. నెక్స్ట్ ఇయర్లో ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు. ఇక ఇప్పుడు బాలీవుడ్లో భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.
బాలీవుడ్ వర్గాల నుంచి లీక్ అయిందా? లేదంటే, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమా? అనేది తెలియదు గానీ.. ధూమ్ 4లో చరణ్ నటించే ఛాన్స్ ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇండియన్ సినిమా దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిన యాక్షన్ ఫ్రాంచైజ్‌లో ధూమ్ సిరీస్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంటుంది. ఇప్పటి వరకు ఈ ఫ్రాంచైజ్‌లో మొత్తం మూడు సినిమాలు వచ్చాయి. అవి ఒకదానిని మించి ఒకటి పెద్ద హిట్స్ అయ్యాయి. ఇక ఇప్పుడు ధూమ్ 4 ప్లాన్ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌తో పాటు రామ్ చరణ్ కూడా నటించనున్నాడని ప్రచారం జరుగుతోంది.
ఇదే జరిగితే.. చరణ్, ఎన్టీఆర్ బాలీవుడ్ మోస్ట్ వాంటేడ్ హీరోలుగా మారిపోనున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్.. వార్2కి సైన్ చేశాడు. ఇందులో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. త్వరలోనే వార్2 షూటింగ్లో జాయిన్ అవనున్నాడు ఎన్టీఆర్. ఇక ఇప్పుడు చరణ్ ‘ధూమ్4’ ఓకె చేస్తే మామూలుగా ఉండదు. ఇప్పటికే ప్రభాస్.. బాలీవుడ్ హీరోలకు కునుకు లేకుండా చేస్తున్నాడు. అలాంటిది.. చరణ్, ఎన్టీఆర్ ఎంటర్ అయితే మామూలుగా ఉండదనే చెప్పాలి.