»Love Guru Movie Review Will The Wifes Quest For Love Succeed
Love Guru Movie Review: భార్య ప్రేమ కోసం పొందే ప్రయత్నం ఫలించిందా?
థ్రిల్లర్ మూవీస్‌తో ఎక్కువగా ప్రేక్షకులను అలరించే విజయ్ ఆంటోని మొదటిసారి ప్రేమ కథ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ సినిమా రోమియో తెలుగులో లవ్ గురు పేరుతో వచ్చింది. ఇందులో మృణాళిని రవి హీరోయిన్గా కనిపించింది. తమిళ, తెలుగు భాషల్లో వచ్చిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ
మలేషియాలో అరవింద్(విజయ్ ఆంటోని) కేఫ్ నడుపుతుంటాడు. అయితే అతనికి తన చెల్లి గతం వేంటాడుతుంటాది. ఇంటిలోని ఆర్థిక సమస్యల వల్ల బిజినెస్‌కి ప్రాధాన్యత ఇస్తుంటాడు. 35 ఏళ్లు వచ్చిన ప్రేమ, పెళ్లి లేదు. అయితే పెళ్లి చేసుకోవాలని అరవింద్ ఇండియాకి తిరిగివస్తాడు. ఓ చావు ఇంట్లో బంధువుల అమ్మాయి లీల(మృణాళిని రవి)ని చూసి ఇష్టపడతాడు. దీంతో అరవింద్ తల్లిదండ్రులు వెంటనే లీలా తండ్రితో పెళ్లి సంబంధం మాట్లాడతారు. కానీ లీలాకు పెళ్లి ఇష్టం లేదు. సినిమా హీరోయిన్ కావాలన్నది ఆమె జీవిత లక్ష్యం. కానీ తన తండ్రికి హీరోయిన్ కావడం నచ్చక.. అరవింద్‌కు ఇచ్చి పెళ్లి చేస్తారు. పెళ్లయిన తర్వాత రోజే లీలాకు తను అంటే ఇష్టం లేదని అర్థం అవుతాది. మరి భార్య ప్రేమను పొందడానికి అరవింద్ ఏం చేస్తాడు? అతనిని వెంటాడుతున్న తన చెల్లి గతం ఏంటి? లీలా హీరోయిన్ అవుతుందా? అరవింద్‌ను తన భర్తగా అంగీకరించిందా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
అరవింద్‌ను ఓ పీడకల వెంటాడం ద్వారా సినిమా మొదలుతుంది. మొదటి చూపులోనే లీలాను చూసి ప్రేమించడం, తర్వాత పెళ్లిచేసుకోవడం జరుగుతుంది. జీవిత లక్ష్యాలకు దూరంగా పెళ్లి చేయడం వల్ల లీల తన భర్త అరవింద్‌ను దూరం పెడుతుంది. తన భర్త మొబైల్ ఫోన్లో వేరే గొంతుతో తనతో మాట్లాడతాడు. ఫస్టాఫ్‌లో కామెడీ బాగుంటుంది. సెకండాఫ్ వచ్చేసరికి కామెడీ తగ్గి ఎమోషనల్ సన్నివేశాలు ఉంటాయి. లీలాను హీరోయిన్ చేయడం కోసం స్వయంగా అరవింద్ నిర్మాతగా, హీరోగా మారుతాడు. ప్రధమార్థంలో కామెడీ ఉండగా.. ద్వితీయార్థం భావోద్వేగభరితంగా ఉంటుంది. సినిమా ఎండింగ్లో అరవింద్, లీలాకు మధ్య వచ్చే సన్నివేశాలు ఎమోషనల్‌గా ఆకట్టుకుంటాయి. చివరికి సిస్టర్ సెంటిమెంట్‌తో సినిమా ఎండ్ అవుతుంది.
ఎవరెలా చేశారంటే?
డిఫరెంట్ ఉండే పాత్రలను విజయ్ చేస్తుంటాడు. ఈసారి కొత్తగా లవ్ మూవీ ట్రై చేశాడు. కామెడీ, ఎమెషనల్ సీన్స్‌లో తన నటనతో ఆకట్టుకున్నాడు. లీలాగా మృణాళిని తెరపై అందంగా కనిపించింది. అయితే ఆమె నటనకు పెద్దగా స్కోప్ దొరికినట్లు అనిపించదు. మిగతా నటీనటులు వాళ్ల పాత్రలకు తగ్గట్లు నటించారు.
సాంకేతిక అంశాలు
టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఈ సినిమాలో విజయ్ ఆంటోని ఎడిటర్‌గా కూడా చేశారు. ఎడిటింగ్ కూడా బాగుందని చెప్పవచ్చు. కథ పాతదే.. కానీ కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు.