Vijay Antony: నీ కష్టం ఎవ్వరికీ రాకుడదు.. నిజంగా గ్రేట్!
పెద్ద కూతురు చనిపోయి పుట్టెడు కష్టాల్లో ఉన్న విజయ్ ఆంటోని.. తన వల్ల సినిమాకు నష్టం కలుగొద్దని మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. దీంతో అంతా ఆంటోని యువర్ గ్రేట్ అంటున్నారు.
Vijay Antony: కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. కంటికి రెప్పలా కాపాడుకున్న కన్న కూతురు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయినా.. పుట్టెడు దు:ఖంలోను తన సినిమా ఆగకూడదని విజయ్ చేస్తున్న పనికి హ్యాట్సాఫ్ అంటున్నారు. ఇటీవల విజయ్ ఆంటోని ఇంట్లో జరిగిన విషాదాన్ని ఇంకా ఎవరు మరిచిపోలేదు. పెద్ద కూతురు మీరా ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని, తల్లి దండ్రులకు తీరని శోకంలో పడేసింది. కన్న కూతురు కళ్ల ముందే విగతజీవిలా పడి ఉండడం చూసి.. విజయ్ ఆంటోని గుండే పగిలిపోయింది. ఆయనను ఓదర్చడం ఎవ్వరి వల్ల కాలేదు. ఏం చేయలేని పరిస్థితి. అందుకే.. ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు విజయ్. ఇకనుంచి ఏ పనిచేసిన కూతురు పేరు మీదే చేస్తానని ఫిక్స్ అయ్యాడు. అయితే కూతురు చనిపోయి శోక సంద్రంలో ఉన్న విజయ్ ఆంటోని.. వారం రోజులకే మీడియా ముందుకు వచ్చాడు.
తన వల్ల సినిమా ఆగిపోవడానికి వీల్లేదని, నిర్మాతలు నష్టాల పాలు అవ్వకూడదని.. తన కొత్త చిత్రాన్ని ప్రమోషన్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న చిత్రం రథం. సిఎస్ ఆముధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. అక్టోబర్ 6న రిలీజ్ కానుంది. విజయ్ కూతురు చనిపోవడంతో ప్రమోషన్స్ వదిలేద్దామని అనుకున్నారట మేకర్స్. తన వల్ల ఎవ్వరికీ నష్టాలు రాకూడదని సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. తాజాగా ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిన్నకూతురు లారాను తీసుకొచ్చాడు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో విజయ్ ఆంటోని చేసిన పనికి పొగుడుతున్నారు. పైకి విజయ్ ప్రమోషన్స్ చేస్తున్నా.. లోపల ఎంత బాధ ఉంటుందో వర్ణించడం కష్టం. కనీసం ప్రమోషన్స్‌తో అయినా ఈ బాధ నుంచి కోలుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఆంటోని. ఏదేమైనా.. ఈ మధ్య కాలంలో చాలామంది హీరోలు ప్రమోషన్స్ వదిలేసి మేకర్స్‌ను ఇబ్బంది పెడుతుంటే.. విజయ్ మాత్రం తన బాధ్యతను మరిచిపోలేదు.. అందుకే విజయ్ గ్రేట్ అంటున్నారు.