స్కంద సినిమాను మాస్ సినిమాగానే చూస్తున్నారు.. అసలు ఈ సినిమా కథ వేరేలా ఉందనేది కొందరు రాజకీయ నేతల మాట. కరెక్ట్‌గా చూస్తే ఈ సినిమా బాలయ్య కోసమే బోయపాటి చేసినట్టుగా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి.
‘Skanda’: ఒకవేళ బోయపాటి శ్రీను లాంటి డైరెక్టర్ బాలకృష్ణకు తగలకపోయి ఉంటే.. ఆ సీన్ ఎలా ఉండేదో ఎవ్వరు చెప్పలేరు. బాలయ్యకు బోయపాటి పర్ఫెక్ట్గా సరిపోయాడు. ఇప్పటి వరకు బాలయ్యను ఎవ్వరు చూపించని విధంగా చూపించి.. కెరీర్ బెస్ట్ సినిమాలు ఇచ్చాడు బోయపాటి. సింహా, లెజెండ్, అఖండ.. ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేశాయి. నెక్స్ట్ అఖండ 2 కూడా అనౌన్స్ చేశాడు బోయపాటి. తాజాగా థియేటర్లోకి వచ్చిన స్కంద సినిమా బాలయ్య కోసమే చేసినట్టుగా ఉందంటున్నారు. స్కంద సినిమాలో రామ్‌తో చెప్పించిన డైలాగ్స్ పొలిటికల్ సెటైర్‌గా ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలను టచ్ చేస్తూ.. ఎలక్షన్ టార్గెట్‌గా సినిమా చేసిన బోయపాటి.. కొన్ని డైలాగ్స్‌తో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్టుగా ఉందనేది కొందరి వాదన.
కామన్ ఆడియెన్స్‌కు ఆ డైలాగ్స్ అర్ధం కాకపోయినా.. క్రిటిక్స్ మాత్రం బాలయ్యతో చెప్పించాల్సిన డైలాగ్స్ రామ్‌తో చెప్పించాడని అంటున్నారు. రచ్చ రవితో ఉచిత పథకాలు, ఏపీ సీఎం పై ఇండైరెక్ట్ సెటైర్ వేయించడం, లాయర్ సన్నివేశాలు, ఫారిన్ సరుకు ఎక్కడం లేదు.. లోకల్ సరుకైతే బూమ్ బూమ్ అని చెప్పడం, సీమలో కరెంట్ రెండు గంటలే ఉంటుందని రామ్ చెప్పిన డైలాగ్స్.. అన్నీ కూడా ఏపీ రూలింగ్ పార్టీ పైనే అని చెబుతున్నారు. దీంతో బాలయ్యతో ఇలాంటి పవర్ ఫుల్ పొలిటికల్ సినిమా చేయొచ్చుగా అనేది కొందరి మాట. ప్రస్తుతం ఏపిలో పొలిటికల్ వేడి ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. కాబట్టి రాజకీయ వర్గాల్లో స్కంద ఇప్పుటు హాట్ టాపిక్‌గా మారింది. ఎప్పటికీ తాను బాలయ్య మనిషినేనని స్కందతో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు బోయపాటి శ్రీను.