Kavitha Aide: కోకాపేట భూముల వేలం కాక రేపాయి. ఎకరం రూ.100 కోట్లకు పైగా పలికాయి. ప్రభుత్వ భూములకు భారీగా కాసులు వచ్చాయి. భూముల వేలంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. కోకాపేట, బద్వేల్ భూముల వేలం పాటలో సీఎం కేసీఆర్ (kcr) కుటుంబం భారీగా అక్రమాలకు పాల్పడుతోందని అంటోంది. ఈ మేరకు కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఈడీకి ఫిర్యాదు చేశారు.
కోకాపేట ఈ-వేలం బిడ్డింగ్‌లో ఎమ్మెల్సీ కవిత (kavitha) బినామీగా ఉన్నారని ఆరోపించారు. బద్వేల్ భూముల వేలంలో మంత్రి కేటీఆర్‌తో (ktr) అవగాహన ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీలు మాత్రమే పాల్గొనేలా అవకాశం ఇచ్చారని ధ్వజమెత్తారు. దీంతో మిగతా కంపెనీలకు ఛాన్స్ రాలేదని అన్నారు. కేటీఆర్ (ktr), కవిత (kavitha) అనుయాయులకే అవకాశం లభించిందని వివరించారు.
ఇటీవల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి 11 ఎకరాలు కేటాయించారు. ఆ సమీపంలోనే కోకాపేట భూములు ఉన్నాయి. 111 జీవోకు సమీపంలో ల్యాండ్స్ ఉన్నాయని జడ్సన్ అంటున్నారు. కోర్టుల్లో కేసులు పెండింగ్ ఉన్న కాంట్రాక్టర్లు బిడ్ ప్రక్రియలో పాల్గొన్నారని.. దాంతో భూముల వేలంలో పాల్గొన్న కంపెనీల కథ ఏంటీ, వెనక ఉన్నదెవరో విచారణ జరపాలని ఈడీని కోరారు. బినామీ లావాదేవీలను అరికట్టడాలని రిక్వెస్ట్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉన్న భూములను విక్రయిస్తోంది. ప్రభుత్వం ఆదాయం సమకూరుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో మిగులు బడ్జెట్‌తో ఉండే.. ఇప్పుడు అప్పుల కుప్పగా మార్చివేశారు. ఒక్కొక్కరి నెత్తిపై లక్షల అప్పును పెట్టారు. ఇదేనా బంగారు తెలంగాణ అని కాంగ్రెస్ సహా విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.