»The Court Remanded The Poem Ordered To Move To Tihar Jail
MLC Kavitha: 14 రోజులు రిమాండ్.. తీహార్ జైలుకు కవిత
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితకు కోర్టులో చుక్కెదురైంది. ఆమెకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఏప్రిల్ 9వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ తీర్పును వెలువరించింది.
The court remanded the poem. Ordered to move to Tihar Jail
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు కోర్టులో చుక్కెదురైంది. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. ఆమె పిటిషన్‌పై తీర్పును ఒక గంట పాటు రిజర్వ్‌లో ఉంచిన కోర్టు కాసేపటి క్రితం తీర్పును వెలువరించింది. ఈ సందర్భంగా 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఏప్రిల్ 9వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ తాజాగా తీర్పును వెలువరించింది. ఆమెను తీహార్ జైలుకు తరలించాలని పోలీసులను ఆదేశించింది. ఈ తీర్పు బీఆర్ఎస్ శ్రేణులను దిగ్భ్రాంతికి గురి చేసింది.
కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 1న విచారణ జరగనుంది. ఈ మేరకు తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కవిత అపిల్ చేశారు. ఆమె విన్నపాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. కవితను మరో 15 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరినప్పటికీ కోర్టు రిమాండ్ విధించింది. ఎమ్మెల్సీ కవిత ఇంట్లో మార్చి 15న ఈడీ, ఐటీ సంస్థలు సోదాలు నిర్విహించిన విషయం తెలిసిందే. కవిత ఇంట్లో కీలకమైన పత్రాలు దొరికినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు 14 రోజులు ఈడీ కస్టడీలో ఉన్న కవిత మధ్యంత బెయిల్‌కు కోర్టులో పిటిషన్ పెట్టున్నారు.