హైదరాబాద్‌లోని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పటాన్చెరు టికెట్‌ను కాట శ్రీనివాస్ గౌడ్‌కు ఇవ్వకపోవడంతో ఆయన అనుచురులు పెద్దఎత్తున రేవంత్ నివాసానికి చేరుకొని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. పటాన్ చెరు కాంగ్రెస్ టికెట్ ఇటీవల పార్టీలో చేరిన నీలం మధు (Neelam Madhu) ముదిరాజ్‌కు ఇవ్వడంతో నయోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నేత కాట శ్రీనివాస్ గౌడ్ (Kata Srinivas Goud) అనుచరులు భగ్గుమన్నారు.
కాట అభిమానులు, అనుచరులు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి ఇంటివద్దకు చేరుకుని ఆందోళనకు దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు శ్రీనివాస్ గౌడ్ అనుచరులను అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి ఇంటివద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. డబ్బులకు పటాన్ చెరు కాంగ్రెస్ టికెట్ (Congress ticket) అమ్ముకున్నారంటూ పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టికెట్ దక్కని ఆశవహుల ఆందోళనలను నిన్నటి వరకు గాందీభవన్ (Gandhi Bhavan) వరకే పరిమితం కాగా.. ఇవాళ ఏకంగా పార్టీ స్టేట్ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి వద్దకే చేరుకోవడం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.