TG: ఏఐ సిటీ నిర్మాణం దిశగా ఆస్ట్రేలియాలోని డీకెన్ వర్సిటీతో చర్చించినట్లు మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాష్ట్రానికి అనేక ఏఐ శిక్షణా కేంద్రాలను తెస్తున్నామని, డీకెన్ వర్సిటీతో అగ్రిమెంట్ చేసుకుంటామని తెలిపారు. హెల్త్ కేర్ సెక్యూరిటీ, ఉత్పత్తి రంగాలపై డీకెన్ వర్సిటీ పరిశోధనలు చేస్తోందని, ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటు దిశగా చర్చించినట్లు వెల్లడించారు.