పెళ్లి వయసు రాకపోయినా.. పరస్పర అంగీకారంతో మేజర్‌గా ఇద్దరు వ్యక్తులు లివ్-ఇన్ సహజీవనం కొనసాగించవచ్చని రాజస్థాన్ హైకోర్టు పేర్కొంది. ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛను అడ్డుకోవడం చట్టబద్ధం కాదని తెలిపింది. 18 ఏళ్ల మహిళ, 19 ఏళ్ల యువకుడు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనను కోర్టు తోసిపుచ్చింది.